Oct 1, 2015

తలరక్ష రక్ష!!!


శిరస్త్రాణం అంట ! 
కాసేపు తల బర బరా గోక్కుని,
 ఆంధ్ర భారతిలోని  తెలుగు నిఘంటువుల్ని చకచకా తిరగేసా!
హెల్మెట్  అంటే తెలుగులో  ఏమిటి చెప్మా అని. 
తెగ బారెడు మాటలు. 

యధాప్రకారము శిరస్త్రాణం తో పాటు,

 శిరః కవచము ,తలజీరా,ఇనుప కుళ్ళాయి , బొమిడకము, నలికాముకుటము  మొదలగునవి వరసబెట్టాయి.

గూగులమ్మేమో ... తేటగా తేల్చి పడేసింది " ఇనుప టోపీ " అని. తలకు పెట్టుకొనే కవచం అని కూడా అందండోయ్!
తలవని భారాన్ని తలకెత్తుకొన్నానే అని తల బాదుకో బోయి,తమాయించుకొని , తటాలున తలపుల్లో మునిగా.
తలపాగా, తల తొడుగు, తల భద్ర , తల రక్ష ,తలచం ....
అబ్బబ్బో ... నా తల తిరిగిపోతోంది ! 
తెలుగండీ తెలుగు ! 

***
సురేశ్ కొలిచాల గారికి ధన్యవాదాలతో.
Suresh Kolichala My entries: 
తలకాపు, తలోలిమి (ఓలము = cover, ప్రొటెక్షన్), తలజీర, తలతొడుగు, తలయుడుపు, గూడ, తలపొదుగు, తలచూడి, తలమఱుగు/వు, తలమాటు, తలమేగు


Chandra Latha Suresh Kolichala garu. ధన్యవాదాలు. 
ఈ మధ్య తరుచు పత్రికల్లో పలకరించే మరో పదం... యూనిఫాం ... సమ దుస్తులు ,ఏక రూప దుస్తులు ... అంటూ. ప్రతి పదానికి అనువాదం చేయకుండా , సరి అయిన తెలుగు పదాన్ని ఎందుకు ప్రతిపాదించలేక పోతున్నారో తెలియడం లేదు. పోని.. ఈ రెండు మ
ాటలు నలుగురి నోళ్ళల్లో నానుతున్నాయా అంటే అదీ లేదు. యూనిఫాం అంటారే కానీ ...ఆ రెండింటిలో ఏ పదమూ వాడరు. 

ఒకే పత్రికలో ఒక సారి ... "ఏక దుస్తుల పంపిణీ " అని రాస్తారు. మరోసారి , "సమ దుస్తుల కొరత" అంటారు. నా బోటీ సామాన్య పాఠకులం ఏం జేస్తాం?" యూనిఫాం అని అనకూడదా నాయనా , ఎందుకొచ్చిన గందరగోళం ?" .. అని తేల్చేస్తాం. అదన్న మాట సంగతి!

పూర్వం కూడా సైనికుల కవాతుల్లో ఒకే రకం బట్టలు, ఆయుధాలు వేసుకొనే వారు కదా .. వారేమి అనే వారో ?


***
  • Suresh Kolichala Uniform అన్న పదానికి దండువుడుపు (దండు ఉడుపు) అన్న ప్రయోగం కనిపిస్తోంది. "ఇంగ్లిషువారి దండు వుడుపును వేసుకొన్నారు"
    • Chandra Latha బావుంది.ఇప్పుడే తెలిసింది. దండు ఉడుపు .. సైన్యం దుస్తులు అనుకోండి. మరే సంధర్భం లోనూ .. ఇలా వాడ లేదా? ముఖ్యంగా, యూని ఫాం ... బిళ్ళ జవాన్ల నుంచి బడిపిల్లల దాకా ... మామూలేగా .. ఆనాటి నుంచి ఈ నాటి వరకు. 
      మీ మాట వలన , నాకు అర్ధమయింది, ఆయా వృత్తి వ్యాపకాలను, సందర్భాలను బట్టి పదాలను వాడారు , ఒకే ఒక సామాన్య పదం కన్నా అని.
    • Giridhar Duggirala మీరు చెప్పింది నిజమే... కాని నాబోటి అర్ధజ్ఞానేస్వరుడికి.. ఎదో దండు వచ్చి ఊడ్చుకు పోఇన తరువాత అన్న అర్ధంలా ఉంది..
    • Charan Raj Pasupuleti · 3 mutual friends
      దండు ఉడుపు అంటే సైనిక వస్త్రాలే అవుతుందే తప్ప యూనిఫాం ( ఏకరీతి వస్త్రాధరణ) ఎలా అవుతుంది.... 
  • నా తెలిసినంతమేర యూరోపియన్ సాంగిత్యంతోటే మనవాళ్ళకు ఏకరీతి సైనిక వస్త్రధారణ అలవర్చుకున్నారు అంతకు మునుపు వారు చిహ్నాలు, జెండాలు ధరించి పోర్లో కొట్టుకునేవారు... రాజ దుస్తులకు, సైనిక దుస్తులకు, పురోహిత దుస్తులకు, సామాజిక, అధికారిక దుస్తులకు మధ్య తేడా కలిగిన ఉండవచ్చుకాని, ఆ దుస్తులు ఒకే రంగు, కుట్టు లేవని శ్రీకృష్ణదేవరాయల మీద వచ్చిన ఓ Monographలో చదివినట్లు గుర్తు.
  • Suresh Kolichala Charan Raj: భాషలో కొత్తపదాలు సృష్టించేనప్పుడు అర్థసంకోచం (narrowing), అర్థవ్యాకోచం (widening) సహజం. ఇంగ్లీషులో అలాంటి పదాలు కోకొల్లలు. 

    నిజానికి "ఉడుపు" అన్న పదాన్నే uniform dress అన్న అర్థంలో వాడుకోవచ్చు. " వాడి ఉడువు చూచి వాడు గుర్రపురౌతని తెలుసుకొన
    ్నాను". ఉమ్మడిఉడుపు, దండుడుపు లాంటి పదాలను కూడా వాడుకోవచ్చు. మనకు తెలుగు ఆకాడమీ వంటి ఒక ప్రామాణిక సంస్థ ఇటువంటి నిర్ణయాలు చేసి పుస్తకాలు ప్రచురిస్తే అందరూ ఒకే పదజాలం వాడటం సులభమౌతుంది.
  • Nagaraju Pappu Suresh Kolichala నాకు ఏమాత్రం ప్రవేశం, పరిచయం లేని విషయం ఇది, అయినా ఉండబట్టలేక - కొన్ని ఇంగ్లీషు పదాలకి తెలుగు అనువాదాలు చూస్తే అవి వాడేవిధంగా ఉండవు. యూనిఫాం అనేది ఇంగ్లీషులో, భాషాపరంగా 'బట్టతో' ఏ సంబంధమూలేని పదం, అందుకే "సమ", ఏక" వంటీ అనువాధాలు దానికినప్పవేమో!! ఇక కొన్ని పదాలకి సింప్లిసిటీ చాలా అవసరం, మనకి రోజువారి వాడకంళో ఉన్న పదాలు కావాలి, తడుముకోకుండా ఎవరికైనా అవి తట్టాలంటే.. యూనిఫాంకే కొలువు బట్టలు అనో బడి చొక్కాలు అనో అంటే చాలదా?
  • Suresh Kolichala Nagaraju: I have always been for all for creating new words based on what is natural and idiomatic in Telugu, instead of attempting to translate English words literally, word-for-word. I hate translations like "సమ దుస్తులు", "ఏక దుస్తులు". If "బడి చొక్కాలు" is currently in usage, then, by all-means it should be encouraged and popularized by the media. 

    However, I also believe Telugu has a large set of vocabulary that has become archaic and fallen into disuse, and it would be very useful to revive and reuse it for modern needs. In that sense, "ఉడుపు" can be resuscitated to mean "uniform" in the modern sense, to refer to any uniform (work/office-uniform or school uniform or army uniform).
  • Charan Raj Pasupuleti · 3 mutual friends
    'ఉడుపు' లాంటి 'మోటు' పదాలు ఈ ఆధునిక తెలుగు ప్రపంచంలొ వ్యాప్తిని పొందుతాయని నేను భావించటం లేదు.. ఇటువంటి పదాల పునర్జీవనంతోటి తేనెలొలుకు తెలుగు అనుకునే స్థాయినుంచి తెలుగంటే నాటుపురం మోటు వ్యవహారంలా సగటు తెలుగు వినియోగకారునికి అనిపించే ప్రమాదం ఉంది.. దాంతో వారు 'యూనీఫామ్' అన్నదానితోనే కొనసాగుతారు... 'బడిచొక్కాలు' కూడా సాంస్కృతిగా దిగువతరగతికి చెందిన వారు మాత్రమే బహిరంగా ఉచ్చరించేదానికి అవకాశం ఉంది (నేడు అలాంటివారెవ్వరూ లేరు. బడి అన్న పదోచ్చరణే తగ్గిపోయింది) ...యూనీఫామ్ కు సూచించే తెలుగుపదం ఒక్క వర్గానికి కాకుండా యూనీవర్శల్ గా (సార్వజనికంగా) ఉంటేనే వ్యాప్తిలోకి తేగలమని నా అభిప్రాయము.


Chandra Latha మోటు పదాలని అనబడుతున్నవి తెలుగు పదాలనీ, హెల్మెట్ అన్న పదం ఎంత పరాయిదో శిరస్త్రాణమూ అంత పరాయిదేననీ... అచ్చమైన తెలుగు పదాలు అనేకం ఉన్నాయని ..మనం వాడుకలోకి తేవచ్చుననీ.. అనుకొంటూ ఈ చిన్ని అభిప్రాయం అచ్చేసాను. 
మన హోసూరు తెలుగు ఉద్యమ మిత్రులు " చే పలుకి (Cell Phone) " మప్పిదాలు( Thanks )" మొదలయిన అనేకానేక పదాలను సహజంగా వాడేస్తున్నారు. బడిలో యూనిఫాం ఉండకూడదని భావించే వారిలో నేనూ ఒకరిని. పిల్లలలో అసమానతల పట్ల అవగాహన కలిగేలా, చేతనాభరితమైన చదువులు చెప్పగలిగినప్పుడు, చెప్పలేని మన చేతగానితనానికి ఒకే రకం ముసుగులేయడం దేనికి?
ఇది, మాటల చర్చ కాబట్టి, ఒక గట్టి పట్టుదలతో , మన తెలుగు ని మరింతగా మన తెలుగు గా మన పిల్లలకు అందించవచ్చు. తెలుగు అక్షరాల్లో ఇంగ్లీసు పదాలను రాయడం, ఇంగ్లీషు పదాలకు ప్రతి పద అనువాదం చేయడం ,సంస్కృతం పట్ల పెరిగే మోజే కానీ తరగని వ్యామోహం , తెలుగంటే ఎన్ని సంకృత పదాల సక్లిష్ట సమాసబూయిష్టమయితే అంత గొప్ప తెలుగన్న భావన లాంటి కొన్ని ... మన తెలుగు జాతి సహజలక్షణాలను సంస్కరించుకొంటే.... ఎంతో సరదాగా సంతోషంగా చేయవచ్చును. మిగిలిన భాషాసంబంధ విషయాలు... భాష పై పలువిధాలుగా కృషి చేస్తున్న విజ్ఞులు Suresh Kolichala garu , Nagaraju Pappu garu చెప్ప గలరు !


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment